అదుపు తప్పితే నదిలోకే..!
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:03 AM
మండలంలోని అలారుదిన్నె గ్రామం వద్దగల కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిలో హంద్రీ వంతెన రెయిలింగ్ కూలింది.
అలారుదిన్నె గ్రామం వద్ద కూలిన హంద్రీ నది వంతెన రెయిలింగ్
దేవనకొండ, సెప్టెంబరు 3 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని అలారుదిన్నె గ్రామం వద్దగల కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిలో హంద్రీ వంతెన రెయిలింగ్ కూలింది. అలాగే రోడ్డుపై గుంత ఉండటంతో వాహదారులు ఏమాత్రం అదుపు తప్పినా హంద్రీ నదిలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వంతెనను బ్రిటీష్ కాలంలో నిర్మాంచారు. 80 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. భారీ వాహనాలు వెళ్లే సమయంలో వంతెన నుంచి శబ్ధాలు వస్తున్నాయి. అధికారులు స్పందించి నూతన వంతెనను నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.