స్వర్ణ పల్లకిలో రాఘవరాయలు
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:28 AM
వేద పండితుల మంత్రోచ్ఛరణలు. మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.
మంత్రాలయం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): వేద పండితుల మంత్రోచ్ఛరణలు. మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి సజీవ సమాధి పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాఽధిపతి సుబుధేంద్రతీర్థుల ఆఽశీస్సులతో మఠం అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మృతిక బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్టించి శ్రీమఠం ప్రాంగణం చుట్టు అంగరంగ వైభవంగా ఊరేగించారు.అనంతరం ఊంజలసేవ నిర్వహించారు.