Share News

రగ్బీలో చాంపియన్లుగా కర్నూలు, తూర్పు గోదావరి

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:23 AM

ఆదర్శ విద్యామందిర్‌ క్రీడా మైదానంలో జరుగుతున్న 69వ స్కూల్‌ గేమ్స్‌ రగ్బీ పోటీల బాలుర విభాగంలో కర్నూలు జట్టు, బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్లు విజయం సాధించి కప్పు కైవసం చేసుకున్నాయి.

రగ్బీలో చాంపియన్లుగా కర్నూలు, తూర్పు గోదావరి
ప్రథమ స్థానంలో నిలిచిన కర్నూలు బాలుర జట్టు

కర్నూలు స్పోర్ట్స్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆదర్శ విద్యామందిర్‌ క్రీడా మైదానంలో జరుగుతున్న 69వ స్కూల్‌ గేమ్స్‌ రగ్బీ పోటీల బాలుర విభాగంలో కర్నూలు జట్టు, బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్లు విజయం సాధించి కప్పు కైవసం చేసుకున్నాయి. మూడో స్థానంలో బాలికల విభాగంలో కాంస్యం సాదించింది. ఆదర్శ విద్యాసంస్థల డైరెక్టర్‌ డా.హరికిషన్‌, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాఘవేంద్ర ఆచారి, క్రీడా పోటీల పరిశీలకులు గణేష్‌, పీడీ శేషయ్య, భాస్కర్‌ రెడ్డి, కిరణ్‌, మేనేజర్‌లు, కోచ్‌లు పాల్గొన్నారు. అనంతరం బాలబాలికల జట్లను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. జనవరిలో జరగనున్న జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 రగ్బీ చాంపియన్‌షి ప్‌లో పాల్గొంటారన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 01:23 AM