శాశ్వత లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:26 AM
కక్షిదారులు శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం.వెంకట హరినాథ్ తెలియజేశారు. ప్రజా వినియోగ సేవలకు సంబందించి ఏమైనా వివాదాలు ఉంటే బాధితులు శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించాలని ఆయన తెలిపారు.
చైర్మన్ ఎం.వెంకట హరినాథ్
కర్నూలు లీగల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులు శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం.వెంకట హరినాథ్ తెలియజేశారు. ప్రజా వినియోగ సేవలకు సంబందించి ఏమైనా వివాదాలు ఉంటే బాధితులు శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించాలని ఆయన తెలిపారు. ఈ వివాదాల పరిష్కారానికి ఎటువంటి ఖర్చులు లేకుండా సత్వర న్యాయాన్ని ఉచితంగా రాజీ మార్గం ద్వారా పొందవచ్చని తెలిపారు. ఈ తీర్పులపై ఎటువంటి అప్పీలు ఉండవన్నారు. శుక్రవారం ఇన్సూరెన్స్ వివాదానికి సంబంధించిన ఓ కేసును సత్వరంగా పరిష్కరించినట్లు తెలిపారు. స్థానిక ఫిర్యాది తోట బుచ్చి అబ్బి 2019లో తన కుటుంబం మొత్తానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఒక మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కుటుంబంలోని ఓ సభ్యుడు అనారోగ్యంతో ఆర్కా ఆసుపత్రిలో చికిత్స చేయించుకు న్నాడు. చికిత్సకు అయిన మొత్తాన్ని రూ.7,82,880 నగదును స్థానిక ఆర్కా ఆసుపత్రికి చెల్లించాడు. ఆ మొత్తాన్ని స్టార్ ఇన్సూ రెన్స్ కంపెనీకి క్లయిమ్ చేయగా.. వారు కేవలం రూ.2లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో మిగతా క్లయిమ్ మొత్తం కోసం ఫిర్యాది శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసును విచారించిన లోక్ అదాలత్ ఇరు పార్టీల రాజీ మేరకు ఫిర్యాదికి రూ.4,82,072 మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించింది.