Share News

రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:43 PM

రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు వేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు
డానిష్‌ టెక్నాలజీతో నిర్మిస్తున్న రోడ్డును సంజామలలో ప్రయోగాత్మకంగా వేస్తున్న రోడ్డును పరిశీలిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

డానిష్‌ ఫైబర్‌ టెక్నాలజీతో నిర్మాణాలు

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ

బనగానపల్లె/ సంజామల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాణ్యమైన రోడ్లు వేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తన నియోజకవర్గంలో నూతన టెక్నాలజీతో రోడ్లు వేయడం ఆనందంగా ఉందన్నారు. డానిష్‌ ఫైబర్‌ విధానంతో సంజామల- ముదిగేడు రోడ్డును నిర్మాణానికి శుక్రవారం మంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డానిష్‌ టెక్నాలజీతో తయారు చేస్తున్న తారుప్లాంట్‌ను ఆయన బనగానపల్లెలో సందర్శించి వాటి వివరాలను డెన్మార్కు, ఆస్త్రేలియా ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంజామలలో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న రోడ్డును ఆయన పరిశీలించారు. సంజామలలో నిర్వహించిన సభలో బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో 20 టన్నుల సామర్థ్యం ఉన్న లారీలు మనరోడ్లపై తిరగడంతో నాలుగేళ్లలోనే రహదారులు దెబ్బతింటున్నాయన్నారు. అందుకే ఆధునిక సాంకేతికత సాయంతో డానిష్‌ టెక్నాలజీతో రహదారులను వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజనీర్‌ వివేకానందారెడ్డి, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ సునీల్‌రెడ్డి, ఏఈ హుసేన్‌, నాయకులు పెండేకంటి కిరణ్‌కుమార్‌, మంచాల మద్దిలేటిరెడ్డి, వెంకటేశ్వర్లు, సురేశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, వెంకటప్రతాప్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శేషారెడ్డి, వీరప్రతాప్‌రెడ్డి, యూసఫ్‌హుసేన్‌, మగ్బూల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:43 PM