Share News

విద్యుర్థులకు నాణ్యమైన విద్య

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:41 PM

నేటి విద్యార్థులే రేపటి ఉద్యోగులు.. అందుకే.. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా క్లస్టర్‌ విశ్వవిద్యాలయం నూతన కోర్సులను ప్రవేశపెట్టింది.

విద్యుర్థులకు నాణ్యమైన విద్య
క్లస్టర్‌ వర్సిటీలో నూతనంగా ప్రారంభమైన లైబ్రరీ

సరికొత్త కోర్సులతో ఉపాధి, ఉద్యోగావకాశాలు

ఆధునిక టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి

ప్రత్యేకంగా నిలుస్తున్న క్లస్టర్‌ వర్సిటీ

నేటి విద్యార్థులే రేపటి ఉద్యోగులు.. అందుకే.. వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా క్లస్టర్‌ విశ్వవిద్యాలయం నూతన కోర్సులను ప్రవేశపెట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని 2024-25 విద్యా సంవత్సరం నుంచి నూతన స్వయం ఆధారిత (సెల్ఫ్‌ ఫైనాన్‌ ్స) కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సులు విద్యార్ధులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపచడంలో ఎంతగానో దోహదపడతాయి. ఈ దిశగా ఆధునిక టెక్నాలజీతో కూడిన సరికొత్త కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా క్లస్టర్‌ విశ్వవిద్యాయం రిజిస్ట్రార్‌ జి.శ్రీనివాసులు పక్కా ప్రణాళికతో నిబద్ధతగా కృషి చేస్తున్నారు.

-కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి)

ఆధునిక కోర్సులతో బంగారు భవిత..

ప్రస్తుతం పీజీ 17, డిగ్రీలో 9 హానర్స్‌, 11 ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీలో కంప్యూటర్‌ సైన్సు. మ్యాఽథ్స్‌, ఫీజిక్స్‌, కెమిస్ట్రి, జువాలజీ, బాటనీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, హోంసైన్సు, డేటా సైన్సు, ఆర్గానిక్‌ కెమిస్ట్రి, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, బీకాం జనరల్‌, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌ స్టాటిస్టిక్స్‌, బీఏ లో హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్సు, స్పెషల్‌ ఇంగ్లీష్‌, స్పెషల్‌ తెలుగు, స్పెషల్‌ ఉర్దూ సబ్జెక్టులు మేజర్‌, మైనర్‌గా ఉన్నాయి. ఈ సబ్జెక్టులతో పాటు అదనంగా మల్టీ డిసిప్లీనరీ కోర్సు (ఎండీసీ), స్కిల్‌ ఎబిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్‌ కోర్సులు ప్రవేశపెట్టారు.

కనీస సౌకర్యాలపై దృష్టి

క్లస్టర్‌ వర్సిటీ పరిఽధిలోని కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలల్లో ఉన్న విభాగాలను బలోపేతం చేయడంతో పాటు నూతన విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఆధునిక బోధనా పద్ధతులను అందించాలనే లక్ష్యంతో తరగతి గదులను స్మార్ట్‌ క్లాస్‌ రూములుగా మార్చడంతో పాటు డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రత్యేక దృష్టి సారించారు.

పరిశోధన రంగాలకు సహకారం

ఇతర యూనివర్సిటీలు, సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటోంది. తద్వార విద్యార్ధులు, ఆధ్యాపకులు, పరిశోధన ప్రాజెక్టులలో పాలు పంచుకుకోవడానికి, నూతన విషయాల ఆధ్యయనానికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే పలు యూనిర్సిటీలు, సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలతో ఒప్పదం కుదుర్చుకునే అవకాశం ఉంది.

24 గంటలూ లైబ్రరీ అందుబాటులో..

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా వర్సిటీలో 24 గంటలు లైబ్రరీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. వేలాది పుస్తకాలు, సాంకేతిక పరమైన కంప్యూటర్లు, మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్యార్థులకు ప్రతి కోర్సుకు అవసరమైన పుస్తకాలను సమకూర్చారు. సిల్వర్‌ జూబ్లీ డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాల విద్యార్థులకు ఈ లైబ్రరీ ఎంతగానో అవసరమైన బండాగారంగా కేవలం గత నెల రోజుల్లో ఈ లైబ్రరీని నూతనంగా అందుబాటులోకి తెచ్చారు.

క్లస్టర్‌ అభివృద్ధికి కృషి

క్లస్టర్‌ విశ్వవిద్యాలయం అభివృద్దికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. సమగ్రాభివృద్ధి దిశగా చర్యలు చేపడుతున్నాం. నూతన కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఉపాధి కల్పనే లక్ష్యంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాం. ఆధునిక సాంకేతికతో కూడిన సౌకర్యాలు అందిస్తున్నాం. వర్సిటీని మరింత ఆదర్శవంతంగా తీర్చిద్దుతాం. -రిజిస్ట్రార్‌ శ్రీనివాసులు

Updated Date - Sep 20 , 2025 | 11:41 PM