Share News

నో హెల్మెట్‌- నో ఎంట్రీ బ్యానర్‌ను ఏర్పాటు చేయండి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 19 , 2025 | 01:05 AM

అన్ని ప్రభుత్వ కార్యాల యాల పరిసరాల్లో తప్పనిసరిగా హెల్మెట్‌ వాడేలా నో హెల్మెట్‌- నో ఎంట్రీ అనే బ్యానర్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ రంజిత బాషా అధికారులను ఆదేశించారు.

 నో హెల్మెట్‌- నో ఎంట్రీ బ్యానర్‌ను ఏర్పాటు చేయండి: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజితబాషా

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): అన్ని ప్రభుత్వ కార్యాల యాల పరిసరాల్లో తప్పనిసరిగా హెల్మెట్‌ వాడేలా నో హెల్మెట్‌- నో ఎంట్రీ అనే బ్యానర్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ రంజిత బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స హాల్లో డిస్ర్టిక్ట్‌ రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పెద్దపాడు నుంచి హైదరాబాదు ఎనహెచకు లింక్‌ చేస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు సంబంధించి ఎనహెచ, ఆర్‌అండ్‌బీ మున్సిపల్‌ శాఖల అదికారులు జాయింట్‌ ఇనసెపెక్షన చేసి నివేదిక అందజేయాలన్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఫ్రీలెఫ్ట్‌కు సంబంధించి, బస్టాండు నుంచి బెంగ ళూరు రోడ్డుకు వెళ్లే వాహనాల కోసం ఫ్రీలెఫ్ట్‌ ఏర్పాటుకు త్వరగా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల బయట ట్రాఫిక్‌ రద్దీ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని హాస్పిటల్‌ అడ్మి నిస్ర్టేషన ఆఫీసర్‌ను ఆదేశించారు. కిడ్స్‌ వరల్డ్‌ నుంచి రాజ్‌విహార్‌ సర్కిల్‌ వరకు ఫ్రీలెఫ్ట్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనాలను త్వర గా సమర్పించాలన్నారు. ఎస్పీ విక్రాంత పాటిల్‌ మాట్లాడుతూ ప్రజలు హెల్మెట్‌ను ఉపయో గించేలా అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్రోల్‌ షాపుల్లో నోహెల్మెట్‌- నో ఎంట్రీ అని బ్యానర్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 01:05 AM