Share News

రైతులను లాభాల బాట పట్టించండి

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:06 AM

రైతుల కష్టాలను క్షేత్ర స్థాయికి వెళ్లి గుర్తించి, వారిని లాభాల బాట పట్టించాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.

రైతులను లాభాల బాట పట్టించండి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రంజిత బాషా

ఆయిల్‌ పామ్‌ సాగుతోనే అన్నదాతకు మేలు

కలెక్టర్‌ రంజిత బాషా

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రైతుల కష్టాలను క్షేత్ర స్థాయికి వెళ్లి గుర్తించి, వారిని లాభాల బాట పట్టించాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఆయిల్‌ పామ్‌ సాగును రైతులతో చేయించా లన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. కలె క్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం కర్నూలు జిల్లాకు 550 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం నిర్దేశించిందని, దీనిని సాధించేందుకు క్షేత్ర స్థాయిలో వెళ్లాలని ఆదేశిం చారు. నేషనల్‌ మిషన ఆన ఎడిబుల్‌ ఆయిల్‌ పామ్‌ పథకం కింద జిల్లాలో క్రిష్ణగిరి, కర్నూలు, సి.బెళగల్‌, కౌతాళం, ఆదోని, హోళగుంద, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి నందవరం, ఎమ్మిగనూరు, హాలహర్వి, గోనెగండ్ల తదితర 13 మండలా లను ఆయిల్‌ పామ్‌ సాగుకు ఎంపిక చేశామన్నారు. ఈ మండలాల్లోని నీటి వసతి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. ఈ పథకం ద్వారా రైతులకు వంద శాతం రాయితీతో మొక్కలు అందిస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది 5,250 అందించడంతోపాటు అంతర్‌ పంట ప్రోత్సాహకానికి ప్రతి సంవత్సరం రూ.5,250 నాలుగేళ్లపాటు అందిస్తున్నట్లు తెలిపారు. జాయిం ట్‌ కలెక్టర్‌ బి.నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ, జిల్లా ఉద్యానశాఖ అధికారి రామాంజనేయులు, ఏపీఎం ఐపీ పీడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 01:06 AM