Share News

మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు

ABN , Publish Date - May 03 , 2025 | 11:01 PM

మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అన్నారు.

మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు
మాట్లాడుతున్న జేసీ విష్ణుచరణ్‌

30వేల టన్నుల కొనుగోళ్లకు అనుమతి

రైతుల గోడౌన్ల వద్ద నిరీక్షించొద్దు

ఎఫ్‌ఏక్యూ నాణ్యతా ప్రకారమే కొంటాం

జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌

నంద్యాల నూనెపల్లె, మే 3 (ఆంధ్రజ్యోతి) : మద్దతు ధరతో జొన్నలు కొనుగోలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జొన్నల కొను గోలు అంశాలపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 30వేల టన్నుల జొన్నల కొనుగోలుకు అనుమతి ఉందని అన్నారు. ఇప్పటివరకు 5వేల మెట్రిక్‌టన్నుల జొన్నలు మాత్రమే కొనుగోలు చేశామని, ఇంకా 25వేల టన్నుల జొన్నలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. రైతు సేవాకేంద్రాల పరిధిలో వ్యవసాయ సిబ్బంది షెడ్యూలింగ్‌ చేసుకున్న తర్వాతనే జొన్నలు అన్‌లోడింగ్‌కు తెచ్చేలా రైతులకు తెలపాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్‌ చేసుకున్న ప్రతి రైతు తమ పత్రాలను కచ్చితంగా తీసుకురావడంతోపాటు అపాయింట్‌ చేసిన ఏజెన్సీవారికి ఇచ్చి ఆన్‌లైన్‌లో ట్రాక్‌ షీట్‌ జనరేట్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు జొన్నల వాహనాలను గోడౌన్‌కు తెచ్చి రెండు, మూడు రోజులు నిరీక్షించవద్దన్నారు. రైతులు అపోహలకు గురికావద్దని ఎఫ్‌ఏక్యూ నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉన్న ప్రతి రైతు జొన్నలు కొంటామని ఆయన వివరించారు.

Updated Date - May 03 , 2025 | 11:01 PM