నిందితుడిని కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:31 AM
చిన్నా రిని చంపి, భార్యపై కర్కషంగా దాడి చేసిన భర్త నరే్‌షను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన పార్టీల నాయకులు రోడ్డెక్కారు. ముందుగా చాకలి వీధిలోని నరేష్ ఇంటిపై శ్రావణి కు టుంబ సభ్యులు, గ్రామస్థులు దాడి చేసి ఇంట్లో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి, బస్టాండ్‌కు చేరుకొని ధర్నా చేశారు
రోడ్డెక్కిన బాధిత కుటుంబ సభ్యులు
పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం
దేవనకొండ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): చిన్నా రిని చంపి, భార్యపై కర్కషంగా దాడి చేసిన భర్త నరే్‌షను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన పార్టీల నాయకులు రోడ్డెక్కారు. ముందుగా చాకలి వీధిలోని నరేష్ ఇంటిపై శ్రావణి కు టుంబ సభ్యులు, గ్రామస్థులు దాడి చేసి ఇంట్లో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి, బస్టాండ్‌కు చేరుకొని ధర్నా చేశారు. శ్రావణికి న్యాయం చేసి బాలుడు సాగర్‌ను నీటి డ్రమ్ములో ముంచి హత్యచేసిన తండ్రిని శిక్షించాలంటూ, దా దాపు ఐదు గంటలపాటు దేవనకొండ-కర్నూలు రహదారిపై ఆందోళన చేశారు. పలుమార్లు ఆందోళన విరమించాలని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, సీఐ వంశీనాథ్ నచ్చజేప్పే ప్రయత్నం చేసి విఫలయత్నం అయ్యారు. ఓ సందర్భంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనకారులు పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితులను సద్దుమణిగించారు. ఐదు గంటలపాటు రహదారిపై ధర్నాలో వాహనాలు ఆగిపోవ డంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్పీ తోపాటు, పరిసర ప్రాంతాల సీఐలు జయ్యన్న, పులిశేఖర్, గంగధర్, నల్లప్ప, ఆందోళనకారులను శాంతింపజేస్తూ పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకోని వాహనాలను తరలించారు. అనంతరం ఆందోళన కారులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రావణికి న్యాయం చేస్తామన్నారు.