Share News

21న పల్స్‌ పోలియో

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:58 PM

: ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేసీ నూరల్‌ ఖమర్‌ తెలిపారు.

21న పల్స్‌ పోలియో
పల్స్‌ పోలియో పోస్టర్‌ను ఆవిష్కరించిన జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

జేసీ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జేసీ నూరల్‌ ఖమర్‌ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్లో పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను అధికారులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులంతా సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలన్నారు. మొత్తం 3,52,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యమ న్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,600 పోలియో బూత్‌ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,180 బూత్‌లు, పట్టణ ప్రాంతాల్లో 420 బూత్‌లు, 52 ట్రాన్సిట్‌ పాయింట్లు 63 మొబైల్‌ యూనిట్లు ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడానికి 5.14లక్షల ఇళ్లను లక్ష్యంగా నిర్ణయించా మన్నారు. డీఎంహెచ్‌వో డా.ఎం.భాస్కర్‌, డీఐవో డా.ఉమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 11:58 PM