Share News

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:20 PM

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
పింఛన్‌ పంపిణీ చేస్తున్న మంత్రి ఫరూక్‌

రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. పట్టణంలోని 8వ వార్డులో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల 1న పింఛన్లు అందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి సుబ్రహ్మణ్యం, క్టస్టర్‌ ఇన్‌చార్జి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 11:20 PM