ప్రజా సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:55 PM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, నవంబరు (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరంలోని తెలుగుగేరిలో ఆయన ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా పింఛన్లు అందిస్తున్నామన్నారు. ప్రతి నెల పింఛన్ సక్రమంగా అందుతుందా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే అధికారులు స్పందించి పరిష్కరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుల్లమ్మ, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, క్లస్టర్ ఇంచార్జీ నవీన్, సీనియర్ నాయకులు, బూత్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.