Share News

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:33 AM

ప్రజా సమస్యలను తర్విత గతిన పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

అధికారులను ఆదేశించిన మంత్రి బీసీ

బనగానపల్లె, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను తర్విత గతిన పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి బీసీ అర్జీలను స్వీకరించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో మౌలిక సదూపాయాల కల్పనపై వచ్చే సమస్యలను పరిష్కరిం చేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు.

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌: నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్‌ఫండ్‌ అని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. బుధవారం ఉదయం బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో సీఎం సహాయనిధి కింద రూ.25.09 లక్షల చెక్కులను బాధిత కుటుంబాలను మంత్రి పంపిణీ చేశారు. మంత్రి బీసీ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కొండంత భరోసా అన్నారు. చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు, మంత్రి బీసీ జనార్దనరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 13 , 2025 | 12:33 AM