సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:45 AM
ప్రజా సమస్యల పరిష్కా రం కోసమే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపడుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య
పాములపాడు సెప్టెంబర్ 12(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కా రం కోసమే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపడుతోందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వ ర్యంలో అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి 18 ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమీక్షలో ఎంఈవో, పంచాయతీరాజ్ ఏఈల పని తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలోని సీసీ రోడ్ల నిర్మాణాల కోసం తీర్మానాలు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రుద్రవరం గ్రామంలో హైవే కింద పాఠశాల పోవ డంతో ప్రత్యామ్నాయంగా వచ్చిన నిధులతో కొత్త స్కూల్ నిర్మాణ విషయంతో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం తుమ్మలూరు గ్రామానికి చెందిన మొల్ల హజరాబి కుటుంబానికి ముఖ్య మంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.51,133 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, ఏవో మహేశ్వరరరెడ్డి, ఏపిఎం మహేశ్వరమ్మ, టీడీపీ నాయకులు చెల్లె హరినాథరెడ్డి, రామలింగేశ్వరరెడ్డి, తిమ్మారెడ్డి, వెంకలేశ్వరరావు, శివశంకర్ పాల్గొన్నారు.