Share News

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:44 AM

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశిం చారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశిం చారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. కాల్‌ సెంటర్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారన్నారు. పీజీఆర్‌ఎస్‌కు సంబంధించి రీఓపెన్‌ కేసుల మీద ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే కర్నూలు వద్ద 22 పత్తికొండ ఆర్డీవో వద్ద 19, కర్నూలు ఆర్డీవో వద్ద 15, ఆదోని సబ్‌ కలెక్టర్‌ వద్ద 15 రీఓపెన్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రీసర్వేకు సంబంధించి కర్నూలు సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే వద్ద రీఓపెన్‌ కేసులు అత్యధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని సర్వే శాఖ ఏడీని ఆదేశించారు. సీఎంవో గ్రీవెన్స్‌కు సంబంధించి ఆదోని సబ్‌ కలెక్టర్‌ వద్ద 10, పత్తికొండ ఆర్డీవో వద్ద 5, కర్నూలు ఆర్డీవో వద్ద 3, కలెక్టరేట్‌ ఏవో వద్ద 3, ఉద్యానశాఖ, సర్వే శాఖ ఏడీ, డిస్ట్రిక్‌ రిజిస్ట్రార్‌, డీపీవోల వద్ద ఒక్కొక్క అర్జీ చొప్పున పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

బీఎల్‌వోలను నియమించాలి

బీఎల్‌వోలు చాలా మంది బదిలీలు అయ్యారని, పదిరోజుల్లో ప్రతి పోలిం గ్‌ బూత్‌లో బీఎల్‌వోలను నియమించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఈఆర్వోలను ఆదేశించారు. ఈసారి స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ ఉండదని, ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:44 AM