రోగులకు నాణ్యమైన సేవలు అందించండి
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:44 AM
రోగులకు నాణ్యమైన సేవలు అందించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ తెలిపారు. సోమవారం కర్నూలు సర్వజన వైద్యశాలను డీఎంఈ సందర్శించారు.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రోగులకు నాణ్యమైన సేవలు అందించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ తెలిపారు. సోమవారం కర్నూలు సర్వజన వైద్యశాలను డీఎంఈ సందర్శించారు. అన్ని విభాగాల హెచ్‌వోడీలతో సమీక్ష నిర్వహిం చారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని, పరిశుభ్రత, రోగుల పట్ల సేవభావం కలిగి ఉండాలని డీఎంఈ ఆదేశించారు. అనంతరం స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్, నర్సింగ్ స్కూల్‌ను పరిశీలిం చారు. స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై డీఎంఈ ఆరా తీశారు. వైద్యసిబ్బందితో మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన సేవలు అందించడంలో రాజీ ఉండకూడదన్నారు. చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పద్దతులను విస్తృతంగా ఉపయో గించి సేవల నాణ్యతను పెంచాలని సూచించారు.
నర్సింగ్ కాలేజీలో సమీక్ష
కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్ వసతులను డీఎంఈ పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో ఉన్న నర్సింగ్ స్కూల్ భవనాన్ని డీఎంఈ పరిశీలించారు. కొత్త భవనానికి సం బంధించిన మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించి దీనిపై ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లతో చర్చించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డా.కృష్ణప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్స్, వైద్యులు పాల్గొన్నారు.