Share News

నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:25 AM

ప్రభుత్వ పాఠశాలలో చదు వుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి మధ్యాహ్న భోజన నిర్వహకులకు సూచిం చారు.

నాణ్యమైన భోజనం అందించాలి
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

బేతంచెర్ల, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదు వుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి మధ్యాహ్న భోజన నిర్వహకులకు సూచిం చారు. సోమవారం మండలంలోని ఎం.పెండేకల్‌, ముద్దవరం, కొలుము లపల్లె గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను, గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు బోధన పద్ధతులు, భవనాల స్థితిని పరిశీలించారు. ప్రభుత్వ పాఠ శాలల పట్ల ప్రజల్లో నమ్మకం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. మండలంలోని ఎం.పెండేకల్‌, ముద్దవరం సచివా లయాల్లో జరుగుతున్న ప్రజా సేవలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఎమ్మెల్యే సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, నాయకులు తిరుమలేష్‌ చౌదరి, సచివాలయాల సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 12:25 AM