Share News

రోగులకు సత్వర వైద్యమందించండి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:08 AM

సీజనల్‌ వ్యాధుల బారిన పడే రోగులకు సత్వరమే వైద్యమందించాలని కర్నూలు విజృంభిస్తున్నాయని, ఈ వ్యాధులకు సత్వర వైద్యం అందిం చాలనిజీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు వైద్యులను ఆదేశించారు.

రోగులకు సత్వర వైద్యమందించండి
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పక చేయించండి

ఆసుపత్రిలో మందులను అందుబాటులో ఉంచాలి

కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధుల బారిన పడే రోగులకు సత్వరమే వైద్యమందించాలని కర్నూలు విజృంభిస్తున్నాయని, ఈ వ్యాధులకు సత్వర వైద్యం అందిం చాలనిజీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లు వైద్యులను ఆదేశించారు. గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సీజనల్‌ వ్యాధులపై ఆయన సూపరింటెండెంట్‌ చాంబరులో అడ్వైజరీ కమిటీతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల డెంగీ, మలేరియా, వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయనీ, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ముఖ్యంగా మెడిసిన్‌, ఎమర్జెన్సీ, చిన్నపిల్లల విభాగాలు అత్యవసర సేవలను వేగవంతంగా అందించాలన్నారు. మైక్రోబయాలజీ, బయో కెమిస్ర్టీ, రేడియాలజి ల్యాబ్‌ పరీక్షలు చేసి వాటి ఫలితాలు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉండేలా చేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు, ఇతర జబ్బులపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రతివారం అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని వ్యాధులపై నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. సమీక్షలో సీఎస్‌ఆర్‌ఎంవో డా.టీసీ వెంకటరమణ, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో పద్మజ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డా.రేణుకాదేవి, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ లక్ష్మిబాయి, బయోకెమిస్ట్‌ హెచ్‌వోడీ డా.కిరణ్మయి, ఎస్‌పీఎం విభాగపు హెచ్‌వోడీ. డా.సుధా కుమారి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.పి.సావిత్రీబాయి పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 12:08 AM