Share News

గిరిజనులకు జీవనోపాధి కల్పించండి

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:00 AM

జిల్లాలోని గిరిజనులకు మెరు గైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి సం బంధిత అధికారులను ఆదేశించారు.

గిరిజనులకు జీవనోపాధి కల్పించండి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజనులకు మెరు గైన, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ రాజకుమారి సం బంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో గిరిజన ఉత్ప త్తులపై శిక్షణ, జీవనోపాధి అవకాశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 48 చెంచుగూడెంలలో సుమారు 9వేల మంది గిరిజనులు నివసిస్తున్నారన్నారు. వీరిలో ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తు న్నారని తెలిపారు. తేనె, ఉసిరి ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు జ్యూట్‌ బ్యాగుల తయారీ, గుడ్డ సంచులు, పేపర్‌ కప్పులు, పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం వంటి నైపుణ్యాధారిత కార్యకలాపాల ద్వారా వారికి మెరుగైన ఆదాయం కల్పించాలన్నారు. జిల్లాలోని అన్నిక్షేత్రాలు, ఆలయాల్లో జాతర రోజుల్లో స్థానిక గిరిజన ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. నంద్యాలలో రూ.25 లక్షల వ్యయంతో బ్యాంకు సహకారంతో యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వివరించారు. డీఎఫ్‌వో విఘ్నేష్‌ అపోవా, డీఆర్వో రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:01 AM