రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:24 AM
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచఎస్ ఆఫీసర్ శ్రీనివాసులు అన్నారు.
డీసీహెచఎస్ ఆఫీసర్ శ్రీనివాసులు
ఓర్వకల్లు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచఎస్ ఆఫీసర్ శ్రీనివాసులు అన్నారు. మంగళ వారం ఓర్వకల్లులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశా రు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవల గురించి ఆయన ఆరా తీశారు. అనంతరం స్టాక్ రూమ్, వివిధ గదులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాత్రి వేళల్లో వైద్యులు తప్పని సరిగ్గా ఉండాలన్నారు. ఎండ తీవ్రతపై తీసుకోవా ల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట వైద్యులు ఉన్నారు.