వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:07 PM
జిల్లాలో విద్యుత్ వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎం.ఉమాపతి సిబ్బందికి సూచించారు.
‘డయల్ యువర్ ఎస్‌ఈ’లో ఉమాపతి
కల్లూరు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్ వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించాలని కర్నూలు విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎం.ఉమాపతి సిబ్బందికి సూచించారు. ‘డయల్ యువర్ ఎస్‌ఈ’లో భాగంగా శుక్రవారం ఆయన ప్రజలు, వినియోగదారుల నుంచి సమస్యలు విన్నారు. స్తంభాలు-2, డీటీఆర్-1, సప్లై ఫెయిల్యూర్-1, లోఓల్టేజీ-2, విద్యుత్ సరఫరాలో అంతరాయం-4, నూతన సర్వీసులు-1, అగ్రికల్చర్ సర్వీసు-1, ఆరు ఇతర సమస్యలపై జిల్లాలో మొత్తం 18 మంది తమ సమస్యలపై ఎస్‌ఈకి విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధుల్లో పాల్గొన్నాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనిచేసే ప్రాంతాల్లోనే అధికారులు నివాసం ఉండాలన్నారు. విద్యుత్ సేవలకు ఎవరికీ ఎలాంటి నగదు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ‘డయల్ యువర్ ఎస్‌ఈ’లో వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో టెక్నికల్ ఏడీఈ విజయభాస్కర్ పాల్గొన్నారు.