మెరుగైన సేవలు అందించండి
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:48 PM
సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జేసీ నూరుల్ ఖమర్ ఆదేశించారు.
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి
జేసీ నూరుల్ ఖమర్
ఓర్వకల్లు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జేసీ నూరుల్ ఖమర్ ఆదేశించారు. బుధవారం మండలంలోని నన్నూరు గ్రామ సచివాలయాన్ని, అంగన్‌వాడీ కేంద్రాన్ని, పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. సచివాలయంలో మూమెంట్ రిజిస్టర్, హాజరు పట్టిక, కార్యాలయ సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు, ప్రజలకు అం దిస్తున్న సేవలపై సిబ్బందితో ఆరా తీశారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, గైర్హాజరైతే కఠినచర్యలు తప్పవన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిం చాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. అంగన్‌వాడీలో నిర్వహణ, పిల్లలకు అందుతున్న ఆహారం, పోషణ ప్రణాళికలు అమలుపై సమగ్రంగా పరిశీలించారు. పోషన్ యాప్‌లో నమోదు చేసిన వివరాలు, రికార్డులు, హాజరు సమాచారం, పంపిణీ ప్రక్రియ పరిశీలించారు. ప్రజలకు సరైన పోషకాహారాన్ని అందించాలన్నారు. మండల ప్రాథమిక పాఠశాలను, లొద్దిపల్లె గ్రామంలో ఫారెస్టు భూమి ని గ్రీన్‌కో 20హెక్టార్ల భూమిని కావాలని దరఖాస్తు చేసుకోగా ఫారెస్టు భూమిని ఆయన పరిశీలించారు. గుమితం తండా సమీపాన ఉన్న జల విద్యుత్ కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్, వీఆర్వో మోహన్, సర్వేయర్ శంకర్ మాణిక్యం, అధికారులు తదితరులు పాల్గొన్నారు