10న నిరసన ప్రదర్శనలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:24 PM
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 10న అన్ని నియోజకవర్గం, మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసనలు జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 10న అన్ని నియోజకవర్గం, మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసనలు జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య పిలుపునిచ్చారు. సోమవారం సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, అధిక వర్షాలు, తుఫానుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పత్తి పంటను క్వింటాలుకు రూ.12 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయా లన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప, జిల్లా కార్యవర్గసభ్యులు కే.జగన్నాథం, పి.రామక్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.