రజకుల ధర్నా
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:25 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రజకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రజకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టరేట్ ఎదుట గాడిదలను తరలించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా వస్త్రాలను ఐరన్ చేస్తూ మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సి.గురుశేఖర్, పాతబస్తీ కార్యదర్శి జయమ్మ శ్రీనివాసులు, శేషాద్రి, రాముడు, సుంకన్న, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.