కిడ్నీలు కాపాడుకోండి
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:54 PM
మానవ శరీరంలో కీలకమైన కిడ్నీలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా సంరక్షించుకోవాలని వైద్యులు సూచించారు. వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో గురువారం ఉదయం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కర్నూలులో ఐఎంఏ వైద్యుల అవగాహన ర్యాలీ
కర్నూలు హాస్పిటల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మానవ శరీరంలో కీలకమైన కిడ్నీలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా సంరక్షించుకోవాలని వైద్యులు సూచించారు. వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో గురువారం ఉదయం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ జాయింట్ సెక్రటరీ సీనియర్ నెఫ్రాలజిస్టు డాక్టర్ వై.సాయివాణి నేతృత్వంలో నగరంలోని రాజ్‌విహార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసి ర్యాలీని రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ పుల్లయ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రాజ్‌విహార్ నుండి కొండారెడ్డి బురుజు వరకు కొనసాగింది. ఈ సందర్బంగా నెప్రాలజిస్టు డాక్టర్ వై సాయివాణి మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లతో కిడ్నీని కాపాడుకోవచ్చని, 40 ఏళ్లు పైబడిన వారు కిడ్నీ పరీక్షలను చేయించుకోవాలన్నారు. మధుమేహం, బీపీని అదుపులో ఉంచుకోవాలని, కిడ్నీ వ్యాధులకు నిర్వహించే చికిత్స (డయాలసిస్) వల్ల చాలా నీరు వృథాగా పోతాయనీ, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువవుతాయనీ, కావున కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేయించుకోవాలన్నారు. ఐఎంఏ కర్నూలు సెక్రటరీ ఎస్‌వీ రామ్మోహన్ రెడ్డి, ఐఎంఏ కోశాధికారి మాధవీశ్యామల మాట్లాడుతూ కిడ్నీ జబ్బు తొలిదశలో గుర్తించి సరైన వ్యాయామం, మంచి ఆహారం మందులతో జబ్బును అదుపులో ఉంచుకోవచ్చునన్నారు. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలని, ఆహారంలో ఉప్పు సోడియంను మితంగా వాడాలన్నారు. ర్యాలీలో ఐఎంవో ఉమెన్ వింగ్ సెక్రటరీ డాక్టర్ విష్ణుప్రియ కర్నూలు జీజీహెచ్ నెఫ్రాలజీ హెచ్‌వోడీ డాక్టర్ అనంత్, ఎండో క్రైనాలజిస్టు డాక్టర్ పి.శ్రీనివాసులు,సీనియర్ క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ బి.రవీంద్రబాబు, వైద్యులు పాల్గొన్నారు.