పర్యావరణాన్ని పరిరక్షించండి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:43 AM
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, జూన 5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పూడిచర్ల జాతీయ రహదారి సమీపంలో నీటికుంటల వద్ద ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మొక్కలు నాటారు. అనంతరం గుట్టపాడు గ్రామ సమీ పంలోని ఉక్కు పరిశ్రమ సమీపాన ఏపీఐఐసీ ఎంఎస్‌ఎం ఇండస్ర్టియల్ పార్కులో నూతన ప్రమోపాలి ప్యాక్ మల్టికలర్ ప్రింటింగ్ ఫ్లెక్సిబుల్ ప్యాకేజీంగ్ ఇండస్ర్టీ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఏపీడీ పద్మావతి, ఏపీ వో మద్దేశ్వరమ్మ, ఈసీ మధుశేఖర్, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుట్టపాడు సర్పంచ మోహన రెడ్డి, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి, టీడీపీ నాయకులు మహబూబ్ బాషా, పుల్లారెడ్డి, ప్రకాశం, తిరుపాలు పాల్గొన్నారు.
పున్నమి రెస్టారెంటును నందనవనంగా తీర్చిదిద్దండి: పున్నమి రెస్టారెంటును నందనవనంగా తీర్చిదిద్దాలని పున్నమి రెస్టారెంటు డివి జన్ల మేనేజర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. గురువారం ఓర్వకల్లు గ్రామ సమీపానగల రాక్ గార్డెన రిసార్ట్‌లో ప్రపంచ పర్యావరణ దినో త్సం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనిట్ మేనే జర్ జీవన, సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్: స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ అధ్య క్షతన కళాశాల ఆవరణలో సెట్కూరు సీఈవో కె.వేణుగోపాల్, ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్, అధ్యాపకులు మొక్కలు నాటారు. జిల్లా ఎంప్లాయి మెంటు ఆఫీసర్ బసవారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
గూడూరు: మొక్కలు నాటి పర్యవరణాన్ని కాపాడు దామని ఆలయ అధికారులు అన్నారు. గురువారం మండలంలోని కె నాగలాపురంలోని కె సుంకులాపరమేశ్వరి ఆలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
కర్నూలు న్యూసిటీ: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కార్పొరేషన ఏఈ వైష్ణవి అన్నారు. గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు.
కర్నూలు రూరల్: కర్నూలు సిటీ రైల్వేస్టేషనలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రైల్వే హెల్త్ ఇనస్పెక్టర్ బి.రామాంజనేయులు పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భం గా కాంకర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాల విద్యార్థులతో రైల్వేస్టేషనలో మొక్కలు నాటించి, ప్రతిజ్ఞ చేయించారు. రైల్వే కమర్షియల్ ఇనస్పెక్టర్ మున్నాజీ, రైల్వే ఎలకీ్ట్రకల్ ఎస్‌ఎస్‌ఈ నాగరాజు పాల్గొన్నారు.
కర్నూలు, అర్బన: ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన కార్యాలయంలో ఆవరణలో ఎక్జైజ్ డిప్యూటీ కమీషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, సీఐలు, ఎస్‌ఐలు మొక్కలు నాటారు.
కర్నూలు కల్చరల్: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ప్రకాశ అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాల యం ఆవరణలో ఆయనతోపాటు సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, ఇనచార్జి జిల్లా ఉపాధికల్పన అధికారి పి. సోమశివారెడ్డి మొక్కలు నాటిం చారు. గ్రీనకోర్ సంస్థ ప్రతినిధి యాగంటీశ్వరప్ప, ఉప గ్రంథాలయ అధికారి పెద్దక్క, లైబ్రేరియన్లు బాషా, వజ్రాల గోవిందరెడ్డి పాల్గొన్నారు.