కేఎంసీ మైదానాన్ని కాపాడుకుంటాం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:23 AM
రాష్ట్రంలోనే ప్రధానమైన కర్నూలు మెడికల్ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకుంటామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మను కలిసి అసోసియేషన్ నాయకులు డా.రాఘవేంద్ర, డా.అశోక్ రెడ్డి, డా.జశ్వంత్ రెడ్డి, డా.నవ్య, డా.కావ్య నేతృత్వంలో 70 మంది వైద్య విద్యార్థులు వినతి పత్రం సమర్పించారు.
కర్నూలు హాస్పిటల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రధానమైన కర్నూలు మెడికల్ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకుంటామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మను కలిసి అసోసియేషన్ నాయకులు డా.రాఘవేంద్ర, డా.అశోక్ రెడ్డి, డా.జశ్వంత్ రెడ్డి, డా.నవ్య, డా.కావ్య నేతృత్వంలో 70 మంది వైద్య విద్యార్థులు వినతి పత్రం సమర్పించారు. వీరికి ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు దళారులు అల్యూమ్ని ట్రస్టు పేరుతో కాలేజీ గ్రౌండ్‌లో మల్టీ యూటిలిటీ సెంటర్ అండ్ నాలెడ్జ్ సెంటర్ పేరుతో ప్రహరీ వద్ద భవన నిర్మాణానికి 2021లో అనుమతి తెచ్చుకోగా తాము వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు మరలా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని దళారుల నుంచి కాపాడి న్యాయం చేయాలని ప్రిన్సిపాల్‌ను వారు కోరారు. ప్రభుత్వ వైద్యుల సంఘం అద్యక్షుడు డా.బ్రహ్మాజి మాస్టర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు కాలేజీ గ్రౌండు కీలకమని, నాలెర్జ్ సెంటర్ నిర్మాణంతో ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, వాకింగ్ ట్రాక్‌లు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నాలెర్జ్ సెంటర్‌కు తాము వ్యతిరేకం కాదని, కాలేజీ ఆవరణంలో ఎక్కడైనా కట్టుకోవచ్చునన్నారు. ఏపీజీడీఏ వైద్యుల సంఘం నాయకుడు డా.విజయశంకర్, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.