Share News

హంద్రీని పరిరక్షించాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:54 AM

నగర శివారులోని లక్ష్మీపురం గ్రామం నుంచి జొహరాపురం వరకు సుమారు 10 కి.మీ. మేర హంద్రీనది 60 నుంచి 70 శాతం ఆక్రమ ణలకు గురైందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు హంద్రీనది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు కోరారు

హంద్రీని పరిరక్షించాలి
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న జిల్లా మేధావుల ఫోరం ప్రతినిధులు

కర్నూలు కల్చరల్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నగర శివారులోని లక్ష్మీపురం గ్రామం నుంచి జొహరాపురం వరకు సుమారు 10 కి.మీ. మేర హంద్రీనది 60 నుంచి 70 శాతం ఆక్రమ ణలకు గురైందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు హంద్రీనది పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు కోరారు. శుక్రవారం హంద్రీనది దినోత్సవం సందర్భంగా, జిల్లా మేధావుల కన్సార్టియం సంస్థ ఆధ్వర్యంలో, నగరంలోని మద్దూరునగర్‌లోగల పింగళి సూరన తెలుగుతోట సమావేశ హాలులో ‘హంద్రీనది పరిరక్షణ-సమస్యలు, సవాళ్లు’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గాడిచర్ల ఫౌండేషన్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ కల్కూర, మానవశక్తి పరిశోధన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాంత ఆచార్యుడు మన్సూర్‌ రెమహాన్‌ల నే తృత్వంలో కొనసాగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్‌) నిర్మాణం 1987లో పూర్తయిన తర్వాత ఈ ఆక్రమణల ప్రక్రియ జోరందుకుందని ఆరోపించారు. నది సరిహద్దులు మాయమవుతున్నాయని, వ్యర్థాలతో నది భూములను పూడ్చి వేయడం బహిరంగంగా జరుగుతోందని విమర్శించారు. హంద్రీనది పరిసర సుమారు 50 గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ ఒక సాధారణ విషయంగా మారిందని, ఇసుక అక్రమ తవ్వకాలతో నదిని అస్తిపంజరంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ సంస్థల ప్రతినిధులు జేఎస్‌ఆర్‌కే శర్మ, డాక్టర్‌ అక్తర్‌ బాను, శశిధర్‌, బి. ఇమ్మానియేల్‌, శ్రీహర్ష తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Updated Date - Dec 06 , 2025 | 12:54 AM