Share News

చేనేతకు గుర్తింపు ప్రతిపాదనలు

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:11 AM

: పట్టణంలో చేనేత కార్మికులు తయారు చేసిన సిల్క్‌ చీరలకు భౌగోళిక గుర్తింపు కోసం కొంత మంది చేనేత కార్మికులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

చేనేతకు గుర్తింపు ప్రతిపాదనలు

కోడుమూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో చేనేత కార్మికులు తయారు చేసిన సిల్క్‌ చీరలకు భౌగోళిక గుర్తింపు కోసం కొంత మంది చేనేత కార్మికులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా హ్యాండ్‌లూమ్స్‌ శాఖ జిల్లా అధికారి నాగరాజరావు శనివారం కోడుమూరు పట్టణంలోని చేనేత కార్మికులు తయారు చేసిన పట్టుచీరలపై ఫీల్డ్‌ స్టడీ చేశారు. కార్మికులు తయారు చేసిన చీరలకు భౌగోళిక గుర్తింపు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ సందర్భంగా నాగరాజరావు మాట్లాడుతూ భౌగోళిక గుర్తింపు పొందడంతో నకిలీ ఉత్ప త్తులను నుంచి రక్షణ, అసలైన తయారీదారులకు చట్టబద్ధ హక్కులు లభిస్తాయని అన్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చెప్పారు. కోడుమూరు ప్రాంతంలో తయారు చేసే చీరలకు ప్రత్యేక బ్రాండ్‌ ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాండ్‌లూమ్స్‌ శాఖ అధికారులు, ప్రతినిధులు సత్యంబాబు, సుభజిత్‌సాహా, పుప్పాల శాంతి సాగర్‌రావు, చేనేత కార్మికులు బెనకన్న, శ్రీనివాసులు, నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:11 AM