Share News

ఎంపీడీవోలుగా పదోన్నతులు

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:12 AM

ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిదిలో పని చేస్తున్న నలుగురు పరిపాలన అధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంపీడీవోలుగా పదోన్నతులు

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా పరిషత్‌ పరిదిలో పని చేస్తున్న నలుగురు పరిపాలన అధికారులకు ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిపాలన అధికారిగా పని చేస్తున్న పి.దస్తగిరిబాబుకు, పాములపాడు మండల పరిపాలన అధికారిగా పని చేస్తున్న ఎం.గాయత్రికి, బనగానపల్లె ఏవో ఎస్‌.నాగరాజుకు ప్రమోషన్లు దక్కాయి. అదే విధంగా కర్నూలు డ్వామాలో పని చేస్తున్న ఏవో టి.కృష్ణమోహన్‌కు కర్నూలు జిల్లాకు కేటాయించారు. వీరికి త్వరలోనే మండలాలను కేటాయిస్తారని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:12 AM