పదోన్నతుల ఫైల్ సిద్ధం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:22 AM
ఈ నెలాఖరులోపు డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతులు లభించనున్నాయి.
త్వరలో డిజిటల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోపు డిజిటల్ అసిస్టెంట్లకు పదోన్నతులు లభించనున్నాయి. ప్రస్తుతం పీఆర్ శాఖలో పదోన్నతుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల 120 మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 గా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం వారితో ఖాళీ అయిన స్థానాలను పదోన్నతి ద్వారా డిజిటల్ అసిస్టెంట్లకు కేటాయించనున్నారు. ఈమేరకు అధికా రులు పదోన్నతుల ఫైల్‌ను సిద్ధం చేశారు. జీవో.నెం.65 ప్రకారం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతి పొందేందుకు 50 శాతం డైరెక్టు రిక్రూట్‌మెంటు ద్వారా మిగతా 50 శాతం డిజిటల్ అసిస్టెం ట్లకు పదోన్నతి కల్పించాలని ఆదేశాలు ఉన్నాయి. ఈనెలలోనే దాదాపు 40మంది గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-3గా పదోన్నతి కల్పించ నున్నారు. అక్టోబరు 31 నాటికి అన్నిస్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం. గ్రామ పంచాయతీలకు జనాభా, ఆదాయం వారిగా వర్గీకరించనున్నారు.