అంగనవాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:28 AM
కూటమి ప్రభుత్వం అంగనవాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మండల కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు.
పాణ్యం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం అంగనవాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఐటీయూ మండల కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దారు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు. రకరకాల యాప్‌లు లేకుండా ఒకే యాప్‌ను అమ లు చేస్తామని, రిటైర్డ్ బెనిఫిట్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఫేస్ యాప్, ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ వంటి రకరకాల యాప్‌లతో అంగనవాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యువగళం పాద యాత్రలో నారా లోకేశ ఇచ్చిన వేతన పెంపు, ప్రమోషనల ఊసే లేదన్నారు. అర్హులైన వారికి రెండు ప్రమోషనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిటీ శివప్రసాద రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగనవాడీ సంఘాల నాయకురాళ్లు వెంకటమ్మ, మాబున్నీసా, మరియమ్మ, స్వ రూప, వసంత వివిధ గ్రామాల అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.