Share News

సిబ్బంది లేక అవస్థ

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:01 AM

తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కొంతమంది సిబ్బంది డిప్యుటేషన్‌పై వెళ్లడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సిబ్బంది లేక అవస్థ
కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయం

పనులు కాక ఇబ్బంది పడుతున్న ప్రజలు

కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయ దుస్థితి

కొత్తపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కొంతమంది సిబ్బంది డిప్యుటేషన్‌పై వెళ్లడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్న బాబుమియా, సాయి కుమార్‌ రెడ్డిలు వేతనాలు కొత్తపల్లిలో తీసుకుంటూ డిప్యుటేషన్‌పై వెళ్లి ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో సేవలందిస్తున్నారు. అలాగే స్థానిక కార్యాలయంలో గత కొంతకాలంగా ఆర్‌ఐ, ఏఎస్‌వో పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అంతేగాకుండా శివపురం, గుమ్మడా పురం, ఎర్రమఠం, కొత్తపల్లి గ్రామాల వీఆర్వో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తపల్లి మండలం ముందే మారుమూల ప్రాంతం.. అందులోనూ గ్రామాలు కూడా తహసీల్దార్‌ కార్యాలయానికి దూరంగా ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి కార్యాల యానికి వచ్చిన ప్రజలు అధికారులు లేక తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. కలెక్టర్‌ స్పందించి సిబ్బంది కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ విషయంపై తహసీల్దార్‌ ఉమారాణిని వివరణ కోరగా... సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే నన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 04 , 2025 | 01:01 AM