Share News

అధ్యాపకుల్లో గుబులు

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:53 AM

ఆయా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకుల గుండెల్లో గుబులు మొదలైంది. పెర్ఫార్మెన్స్‌ పేరుతో తొలగించేందుకు కుట్ర జరుగుతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

అధ్యాపకుల్లో గుబులు

పెర్ఫార్మెన్స్‌ పేరుతో తొలగించేందుకు కుట్ర

ఆర్‌యూలో రెండు రోజులుగా సాగిన రివ్యూ

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అధ్యాపకులు

కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆయా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న తాత్కాలిక అధ్యాపకుల గుండెల్లో గుబులు మొదలైంది. పెర్ఫార్మెన్స్‌ పేరుతో తొలగించేందుకు కుట్ర జరుగుతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన రివ్యూకు కొందరు హాజరయ్యారు. మరి కొందరు అధ్యాపకులు కోర్టును ఆశ్రయించి రివ్యూకు హాజరు కాకపోవడం చర్చకు దారీతీసింది. ఇటీవల ఎస్వీయూ(శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ)లో ఫెర్పామెన్‌ ్స ఇంటర్వ్యూలు నిర్వహించి 43 మంది అధ్యాపకులను తొలగించిన విషయం ఇక్కడి అధ్యాపకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గతనెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన పెర్ఫార్మెన్స్‌ తీరుపై అధ్యాపకులు తమను తొలగిస్తారా అంటూ చర్చించుకుంటున్నారు. న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన ఉద్యోగులపైన ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తున్నట్లు తెలిసింది. వారిపై తప్పులు వెతుకుతు న్నారని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు.

ఎస్వీయూ, ఆర్‌యూలో మాత్రమే..

రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ పెర్ఫార్మెన్స్‌ రివ్యూ ఇంటర్వ్యూ లను నిర్వహించడం లేదు. ఎస్వీయూ, రాయలసీమ యూనివర్సిటీ (ఆర్‌యూ)లు మాత్రమే ఎందుకు నిర్వహిస్తున్నా యని ఉద్యోగులు మండి పడుతున్నారు. గత ప్రభుత్వంలో అధికారుల వేదింపులతో కొంత మంది కాంట్రాక్టు అధ్యాప కులు విసిగిపోయారని, కూటమి ప్రభుత్వం వస్తే తమకు మంచి జరుగుతుందని టీడీపీ ప్రభుత్వానికి ఓటేస్తే కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు.

మంత్రి నారా లోకేశ్‌ను కలిసేందుకు..

పెర్ఫార్మెన్స్‌ రివ్యూ పైన కొంతమంది తాత్కాలిక ఉద్యోగులు త్వరలో మంత్రి నారా లోకేశ్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. యూనివర్సిటీలో వైసీపీ భావజాలం ఉన్న ఉద్యోగులకే న్యాయం జరుగుతుందని, టీడీపీ భావజాలం ఉన్న ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని మరి కొందరు మండి పడుతున్నారు. . కూటమి ప్రభుత్వమే తమకు న్యాయంచేయాలని పలువురు అధ్యాపకులు వేడుకుంటున్నారు.

పెర్ఫార్మెన్స్‌ రివ్యూలు నిర్వహించం

ఉర్దూ యూనివర్సిటీలో పెర్ఫార్మెన్స్‌ రివ్యూలు నిర్వహించం. 14 మంది తాత్కాలిక అధ్యాపకులు ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. పెర్ఫా మెన్స్‌ రివ్యూ చేసి వాళ్ల జీవితాలను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. ఉత్తమ ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో ఉర్దూ యూనివర్సిటీకి మంచి భవిష్యత్తు ఉంది. డాక్టర్‌ పీఎస్‌ షావలి ఖాన్‌, వీసీ, ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలు

ఎవర్ని తొలగించే ఆలోచనే లేదు

పెర్ఫామెన్స్‌ రివ్యూ ప్రతి ఏటా నిర్వహిస్తాం. ఏ అధ్యాపకుడిని తొలగించాలనే ఆలోచన మాకు లేదు. ఈరివ్యూతో అధ్యాపకుడు తన బోధన తీరును మరింత మెరుగు పరచుకునేందుకు అవకాశం ఉంటుంది. - బోయ విజయకుమార్‌ నాయుడు, రిజిస్ట్రార్‌, ఆర్‌యూ, కర్నూలు

Updated Date - Sep 02 , 2025 | 12:53 AM