చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:31 PM
చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలి
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రతి అధికారి చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులు సమ ష్టిగా పనిచేయాలని ఆదేశించారు. కొన్ని సమస్యలను సం బంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పొలం వివాదాలు, వ్యక్తిగత సమస్యలు మంత్రి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు.