సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - May 26 , 2025 | 11:48 PM
సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లె, మే 26 (ఆంధ్రజ్యోతి): సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎ్‌సహాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పీజీఆర్‌ఎ్‌సకు 246దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ రీ ఓపెన్ అయిన 48 దరఖాస్తులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 1.374 ఫిర్యాదులకు సంబంధించి ఆడిట్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అర్జీదారుల అభిప్రాయ సేకరణకు ఇంకా 42.83శాతం పెండింగ్‌లో ఉన్న డేటాను సేకరించి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సర్వేలలో మనమిత్ర క్యాంపెయిన్‌లో ఇంకా 12,724పెండింగ్‌లో ఉన్నాయని, సిటిజన్ ఈకేవైసీ 2,23,024 మందికి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. చిల్డ్రన్ వితౌట్ ఆధార్ 6554, హౌసింగ్ ఇమేజి జియోకోర్డినేట్‌కు సంబంధించి 622 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.