సమస్యలను త్వరగా పరిష్కరించాలి: మంత్రి బీసీ
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:10 AM
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులు ఆదేశించారు.
బనగానపల్లె, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అధికారులు ఆదేశించారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా పింఛన్లు, రెవెన్యూ, ఉపాధి, ఉద్యోగ, భూవివాదాలకు సంబంధించి పలు సమస్యలను విన్నవిం చారు. 108 ఉద్యోగులు మంత్రిని కలసి సమస్యలను పరిష్కరిం చాలని కోరారు.