సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:27 AM
ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక మండల పరిషత కార్యాలయంలో తాలుకాలోని ఆరు మండలాల ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ప్రజా సమ స్యల పరిష్కర వేదికల ద్వారా ఎన్ని అర్జీలు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే పీ4, బంగారు కుటుంబాల కార్యక్రమా లపై ఆమె సమీక్షించారు. స్థానిక మండల పరిషత కార్యాలయం ఆరవణలో ఎంపీడీవో నూర్జాహాన ఆధ్వర్యంలో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు.