సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - May 26 , 2025 | 11:36 PM
సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
నిర్లక్ష్యం చేసిన సిబ్బందిపై చర్యలకు ఆదేశం
కర్నూలు కలెక్టరేట్, మే 26 (ఆంధ్రజ్యోతి): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించిన భూసర్వే ఏడీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, సర్వేశాఖలో రెండు ఫిర్యాదులు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ వెళ్లాయని, సంబంధిత సర్వేయర్లను సస్పెండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీని ఆదేశించారు. అధికారులు వారం రోజుల అర్జీలను చూడకుండా ఉంటే, వారికి మెమోలు జారీ చేయాలని తదుపరి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ డీఆర్వోను ఆదేశించారు. అర్జీలు చూడకుండా ఉన్న శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలను ఆదేశించారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు.
ట్రైనర్ల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి చేయాలి: జేసీ
యోగాంధ్ర క్యాంపెయిన్‌లో భాగంగా మండలాల్లో ట్రైనర్ల రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య సూచించారు. అదేవిధంగా జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి కార్యక్రమాల నిర్వహణకు వేదికలను గుర్తించాలని జేసీ సంబంఽధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.