Share News

సమస్యలనుపరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - May 06 , 2025 | 12:04 AM

రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

సమస్యలనుపరిష్కరించాలి: కలెక్టర్‌
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

నంద్యాల నూనెపల్లె, మే 5(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరిహాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 207దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఫిర్యాదులను సరిగా రెడ్రస్‌ చేయని కారణంగా 77 దరఖాస్తులు రీ ఓపెన్‌ అయ్యాయని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయసేకరణకు సంబంధించి 4 సచివాలయాలు ఇంతవరకు అభిప్రాయ సేకరణ చేపట్టకపోవడానికి గల కారణాలు ఏమిటని కలెక్టర్‌ ప్రశ్నించారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్‌, డీఆర్వో రామునాయక్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:04 AM