ఖైదీలు సత్ప్రవర్తనను అలవర్చుకోవాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:53 PM
ఖైదీలు సత్ప్రవర్తనను అలవర్చుకుని శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి సూచించారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి
కర్నూలు లీగల్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఖైదీలు సత్ప్రవర్తనను అలవర్చుకుని శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి సూచించారు. పంచలింగా లలోని జిల్లా జైలును ఆయన మంగళ వారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ ఖైదీలు కక్షలను విడనాడి, గతాన్ని మరిచి మంచి పౌరులుగా మారాలని కోరారు. 70 సంవత్సరాలు వయస్సు పైబడిన ఖైదీలు, అనారోగ్యంతో బాధపడే ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, వారికి త్వరలో బెయిల్ మంజూరయ్యేలా కృషిచేస్తామని తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన ప్రిజన్ లీగల్ ఎయిడ్‌ల గురించి ఖైదీలకు వివరించారు. ఈ క్లినిక్‌లలో ఒక న్యాయవాది, ఒక పారా లీగల్ వలంటీర్ సభ్యులుగా ఉంటారని, ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా జైలును, మహిళా జైలును పరిశీలించారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు తప్పకుండా హాజర య్యేలా చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించారు. ఖైదీలకు సమస్యలు ఉంటే హెల్ప్‌లైన్ 15100కు సంప్రదించాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.లీలా వెంకట శేషాద్రి, లీగల్ ఎయడ్ న్యాయవాదులు శివరాం, సులోచన, జైలు అధికారులు పాల్గొన్నారు.