Share News

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్ష

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:00 AM

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారిని అనాథలుగా చేసే పిల్లలకు జైలు శిక్ష పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్ష
మాట్లాడుతున్న లీలా వెంకట శేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

కర్నూలు లీగల్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారిని అనాథలుగా చేసే పిల్లలకు జైలు శిక్ష పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. నగరంలోని బి.క్యాంపు, మద్దూరునగర్‌లోని రెండు వృద్ధాశ్రమాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. ఆయన వృద్ధులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలపై ఉందని, నిర్లక్ష్యం చేసిన వారి పిల్లలపై భరణం కేసులు దాఖలు చేసి భరణం రాబట్టుకునే హక్కు వృద్ధ తల్లిదండ్రులకు ఉంటుందని చెప్పారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులను వదిలి వేస్తే మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. సంక్షేమ చట్టం-2007పై వృద్ధులకు అవగాహన కల్పించారు. వృద్ధులకు ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే వారు నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గాని, టోల్‌ ఫ్రీ నెంబరు 15100కు ఫోన్‌ చేసి సమస్యలను చెప్పుకోవచ్చని తెలిపారు. బాఇత తల్లిదండ్రుల తరుపున జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాదిని నియమించిసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాది రాంపుల్లయ్య, సభ్యుడు డా.రాయపాటి శ్రీనివాస్‌, న్యాయవాది పాపారావు, కర్నూలు పెన్షనర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు మద్దిలేటి, ఆశ్రమ నిర్వహకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 01:00 AM