పరిశుభ్రతకు ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:30 AM
పట్టణంలో పరిశుభ్ర తకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదే శించారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి
బనగానపలె, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలో పరిశుభ్ర తకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదే శించారు. బనగానపల్లె పట్టణ శివా రులోని డంప్‌యార్డును మంత్రి బీసీ శనివారం పరిశీలించారు. చెత్తను డంప్ చేసే విధానం, డంప్‌యార్డు నిర్వహణ ఏర్పాట్లను పరిశీ లించారు. అలాగే పట్టణ శివారులో రూ.50కోట్లతో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు పనులను మంత్రి బీసీ పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్‌ఆండ్‌బీ అధికారులను ఆదే శించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి పూజలు: పట్టణం లోని కొట్నాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంత్రి బీసీ పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరిం చుకొని ఆలయానికి భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలుగ కుండా ప్రత్యేక క్యూలైనలో స్వామివారి దర్శన ఏర్పాట్లు, పోలీస్ భద్రత, బారికేడ్లు ఏర్పాటుపై స్థానిక నాయకులతో చర్చించారు. కొత్తగా నిర్మిస్తున్న వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంపై కూడా ఆరా తీశారు.