Share News

మోదీ.. జన సునామీ

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:17 AM

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన జీఎస్టీ సభకు జనం సునామీలా తరలి వచ్చారు. నన్నూరు రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో గురువారం నిర్వహించిన సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ సభకు కోడుమూరు, కర్నూలు నియోజవకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మోదీ.. జన సునామీ
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తదితరులు .. సభా ప్రాంగణం వద్ద కిక్కిరిసిన జనం

సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ సభకు భారీగా తరలి వచ్చిన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు

ప్రణాళిక, సమన్వయంతో వ్యవహరించిన అధికారులు

ప్రజలకు విస్తారంగా ఆహారం, తాగునీరు, మజ్జిగ పాకెట్ల పంపిణీ

ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు

కర్నూలు క్రైం/కర్నూలు న్యూసిటీ/కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌/కర్నూలు అర్బన్‌/ క్నూలు కలెక్టరేట్‌/ కల్లూరు/గూడూరు/కోడుమూరు రూరల్‌/ ఓర్వకల్లు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన జీఎస్టీ సభకు జనం సునామీలా తరలి వచ్చారు. నన్నూరు రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో గురువారం నిర్వహించిన సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌ సభకు కోడుమూరు, కర్నూలు నియోజవకవర్గాల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ భోజన ప్యాకెట్లను అందజేశారు. టీడీపీ కన్వీనర్‌ గోవిందరెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, కన్నమడకల సుధాకర్‌రావు ఉన్నారు.

ప్రధానికి ఘన స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓర్వకల్లు విమానాశ్రయంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో పాటు కలెక్టర్‌ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.45 గంటలకు ఓర్వకల్లు విమానా శ్రయానికి చేరుకున్నారు. 10.19 గంటలకు శ్రీశైలానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. ఓర్వకల్లు సభ 4.33 గంటలకు నిమిషాలకు ముగించుకుని 4.52 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

సభా ప్రాంగణంలో చిరు వ్యాపారుల సందడి కన్పించింది. లక్షల్లో జనం హాజరు కావటంతో తినుబండారాలు విక్రయించే వేరుశనగ, ఐస్‌క్రీం, పుచ్చకాయ, చిరుతిళ్లతో పాటు చలువ కళ్లద్ధాలను సైతం అమ్ముతూ కన్పించారు.

పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా చర్యలు

ఉమ్మడి జిల్లాల్లోని నియోజకవర్గాల నుంచి వచ్చిన వాహనాలకు పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టారు. నంద్యాల నుంచి వచ్చే వాహనాలు టోల్‌ గేటు దాటి రానీయకుండా అక్కడికక్కడే పార్కింగ్‌, కర్నూలు, కోడుమూరు, ఆదోని నుంచి వచ్చే ప్రజలకు ఇటువైపే పార్కింగ్‌ ఏర్పాటు చేసి సభలోకి వెళ్లేలా మార్గాలు ఏర్పాటు చేయడం, డోన్‌ వైపు నుంచి వచ్చే వారికి సభ వెనుక వైపు దారి ఏర్పాటు చేయడం, వీఐపీలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడం విశేషం.

అందుబాటులో ఆహారం..

సభ కోసం వచ్చే ప్రజల కోసం పార్కింగ్‌ ప్రదేశాల వద్ద, ప్రధాన మార్గాల వద్ద ఆహారం, మజ్జిగ, తాగునీరు అందించారు. మరో వైపు ప్రజలు బస్సు దిగిన వెంటనే అక్కడే ఆహార పొట్లాలు అందించారు.

మోదీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌లతో పాటు కేంద్ర మంత్రులు, కూటమి పార్టీల అధ్యక్షులతో ర్యాలీగా సభ వరకు చేరుకున్నారు. ర్యాలీ జగుతున్నంత సేపు.. జయహో అంటూ పాటకు సభలో ఉన్న ప్రజలు జెండాలు ఊపుతూ ప్రధానీ మోదీ స్వాగతం పలికారు.

మోదీ పర్యటన, బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించడంలో సహకరిచిన కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బందికి కమిషనర్‌ విశ్వనాథ్‌ అభినందనలు తెలిపారు. సమష్టి కృషితోనే ఇబ్బందులు తలెత్తలేదని తెపాఆరు.

సాయంత్రం 4.10 గంటలకు సభ ముగుస్తున్నా బస్సులు సభాస్థలికి వస్తూ కలిపించాయి. ఆలూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు ప్రాంతాల నుండి 4 గంటల తర్వాత కూడా బస్సులు రావడం గమనార్హం.

మోదీకి స్వాగతం పలికిన మంత్రి టీజీ భరత్‌

ప్రధాన మంత్రి మోదీకి రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ పలికారు. ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టులో ఘనస్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు రామ్మెహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారాలోకేష్‌తో కలిసి పర్యవేక్షించారు. మధ్యాహం్న ఓర్వుకల్లుకు తిరిగి చేరుకున్న మోదీకి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌లతో కలిసి మరో సారి స్వాగతం పలికారు.

ఫ కోడుమూరు మండలం లద్దగిరి, గోరంట్ల, వెంకటగిరి, చిల్లబండ, ఎర్రదొడ్డి, అమడగుంట్ల, అనుగొండ, ప్యాలకుర్తి, కొత్తూరు, వర్కూరు, ముడుమలగుర్తి, క్రిష్ణాపురం, కల్లపరి, పులకుర్తి గ్రామాల ప్రజలు పోటెత్తారు.

గూడూరు నుంచి టీడీపీ నాయకులు జెసురేష్‌, కె.రామాంజనేయులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తరలివచ్చారు. సృజన్‌, రేమట వెంకటేష్‌, కోడుమూరు షాషావలి, పెద్ద చాంద్‌బాషా, వీర కుమార్‌ పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు మల్లేష్‌ నాయుడు, గజేంద్ర గోపాల్‌ నాయుడు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు

ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం..

ప్రధానమంత్రి పర్యటన, బహిరంగ సభ సూపర్‌ సక్సెస్‌ కావడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కలెక్టర్‌ సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో సహా అధికారులంతా పదిహేను రోజులుగా ప్రణాళికతో వ్యవహరించడంతో సభ ప్రశాంతంగా ముగిసింది.

అధికారుల చక్కని సమన్వయం

సభకు ఏర్పాట్లు చేయడంలో అధికారులు చక్కని సమన్వయంతో వ్యవహరించారు. దాదాపు 3వేల బస్సులు, వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలకు వచ్చినా ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా వ్యవహరించారు. ఉన్నతాదికారుల ఆదేశాలతో 15 పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఎంఈ, వీఐపీ, వీవీఐపీల గ్యాలరీల్లోకి పంపే విషయంలో జాగ్రత్త వహించారు.

భారీ పోలీసు బందోబస్తు

పోలీసు శాఖ సుమారు 8వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడా అత్యుత్సాహం ప్రదర్శించకుండా ప్రజలతో సమన్వయంతో మెలగడం విశేషం. అడుగుకో పోలీసు చొప్పున ఉంటూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు పర్యవేక్షించారు. వాహనాలకు వచ్చినట్లుగా పార్కింగ్‌కు దారి చూపిస్తూ పోరాటం చేశారు.

Updated Date - Oct 17 , 2025 | 12:17 AM