పెరిగిన పంట ఉత్పత్తుల ధరలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:08 AM
కర్నూలు మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులకు రైతులు ఊహించలేని విదంగా ధరలు పెరిగాయి.
పల్లీ గరిష్ఠం రూ.9,099
ఆనందంలో రైతన్నలు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులకు రైతులు ఊహించలేని విదంగా ధరలు పెరిగాయి. నిన్న, మొన్నటి దాకా వేరుశనగకు క్వింటానికి గరిష్ఠం రూ.7వేల లోపు మాత్రమే ధర దక్కింది. మంగళవారం ఏకంగా గరిష్ఠ ధర రూ.9,099, మధ్యస్థం రూ.6,299లు, కనిష్ఠం రూ.5,219 దక్కడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాముకు గరిష్ఠ ధర క్వింటానికి రూ.11,218, మధ్యస్థ ధర కూడా అంతే మొత్తం అందగా.. కనిష్ఠం రూ.11,018 దక్కింది. ఉల్లిగడ్డలకు ఎన్నడూ లేనంతగా క్వింటానికి గరిష్ఠ ధర రూ.2,289లు, మధ్యస్థం రూ.1,729, కనిష్ఠం రూ.869 దక్కాయి. ఇప్పటి నుంచి ఉల్లిగడ్డలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని అధికారులు చెబుతున్నారు. కందులకు క్వింటానికి గరిష్ఠం, మద్యస్థ ధర రూ.7,120, కనిష్ఠం రూ.4,601ల ధర పలికింది. మినుములకు గరిష్ఠ ధర రూ.7,100, మద్యస్థం రూ.6,629, కనిష్ఠం రూ.6,389 దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.