‘టామోటాకు మద్దతు ధర’
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:58 AM
మార్కెట్ యార్డులో టమోటాకు మద్దతు ధర ఇస్తున్నామని కార్యదర్శి కార్నలీస్ అన్నారు. మంగళవారం టమోటాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది ఆరంభంలో మంచి ధర వచ్చిందని, అయితే గత వారం ధరలు పడిపోయాయన్నారు.
పత్తికొండ మార్కెట్ యార్డు కార్యదర్శి కార్నలీస్
పత్తికొండ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మార్కెట్ యార్డులో టమోటాకు మద్దతు ధర ఇస్తున్నామని కార్యదర్శి కార్నలీస్ అన్నారు. మంగళవారం టమోటాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది ఆరంభంలో మంచి ధర వచ్చిందని, అయితే గత వారం ధరలు పడిపోయాయన్నారు. విషయాన్ని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని మార్కెట్‌యార్డుద్వారా ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు మార్కెట్ యార్డు తరపున మూడురోజులు కొనుగోలు చేశామన్నారు. అయితే సోమవారం నాణ్యతను బట్టి కిలో రూ.10ల వరకు ధర పలింకిందని, మంగళవారం కిలో రూ.15ల వరకు చేరిందన్నారు. ప్రభుత్వ ధర కంటే అధికంగా వ్యాపారులు ఇస్తుండటంతో తాముయ కొనుగ్లోను నిలిపివేశామన్నారు. ఒకవేళ ధరలు తగ్గితే తిరిగా మార్కెట్‌యార్డు తరపున గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దు.