డీపీఆర్‌లు రూపొందించండి: కలెక్టర్
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:30 AM
మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పి.రంజిత బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశిం చారు.

కర్నూలు కలెక్టరేట్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యులతో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు డీపీఆర్‌లు రూపొందించాలని కలెక్టర్ పి.రంజిత బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స హాల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వ హించిన కలెక్టర్ల కాన్ఫరెన్సలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్య లపై కలెక్టర్, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు 50 లేదా వంద మందితో క్లస్టర్‌లుగా రూపొందించి వారితో ఓర్వకల్లు ఎంఎస్ ఎంఈ పార్కులో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేయించాలని ఏపీఐఐసీ జడ్‌ఎం, మెప్మా పీడీ, డీఆర్‌డీఏ పీడీ, ఇండస్ర్టీస్ జీఎంను ఆదేశించారు. తడకనపల్లి కోవా తయారీదారులు, జూట్‌బ్యాగ్ ఉత్పత్తులు చేసే వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఏపీఐఐసీ ద్వారా వారికి సరిపడినంత భూ మిని కేటాయించి, షాపులు నిర్మిస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కులు, బస్, రైల్వేస్టేషన్లు, వసతి గృహాలు, ఆసుపత్రులు, మార్కెట్ యార్డులు, రైతుబజార్లు, అంగనవాడీ కేంద్రాలు, పారిశ్రామిక సంస్థలు తదితర ప్రాంతాల్లో ఈ నెల 3వ శనివారం పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవ సాయ అనుబంధ శాఖల సమీక్షలో భాగంగా వచ్చే ఏడాదికి లక్ష్యంగా నిర్దేశించిన 64 వేల ఎకరాలకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా చర్యలు తీసుకోవాల న్నారు. నెలాఖరున నిర్వహించనున్న కలెక్టర్‌ల కాన్ఫరెన్సకు ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సీపీవోకు అందజేయాలని కలెక్టర్ ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సీపీవో హిమప్రభాకర్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.