స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:28 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణరథం పై విహారించారు.
మంత్రాలయం, జూలై 3(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణరథం పై విహారించారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన అషాడ అష్టమి గురువారం శుభదినంను పురస్కరించుకుని శ్రీమఠం పీఠా ధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి విశేష పూజలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల, విద్యుత దీపాల మధ్య స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహా మంగళహా రతులిచ్చారు. భక్తుల హర్షధ్వనాల మధ్య ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు.ఉత్సవ మూర్తికి ఊంజల సేవ నిర్వహించారు. మఠం పీఠాధిపతి భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
మంచాలమ్మకు సుగంధ ద్రవ్యాలతో విశేషాభిషేకం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో వెలసిన గ్రామదేవత మంచాలమ్మ దేవతకు మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సుగంధ ద్రవ్యాలతో విశేషాభిషేకం నిర్వహించారు. మఠం పీఠాధిపతి ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నిర్మలవిసర్జనం, క్షీరాభిషేకం, కుం కుమ సేవ, సుగంధ ద్రవ్యాలతో విశేష పంచామృతాభిషేకం చేసి పసు పు, గందం, పట్టుచీర, బంగారు, వెండి ఆభరణాలతో పాటు బెంగళూరు నుంచి తెచ్చిన వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరిం చారు. పీఠాధిపతి మహా మంగళహారతులిచ్చారు. వివిధ రాషా్ట్రలనుంచి వచ్చిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మంచాలమ్మను దర్శి ంచుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
ముగిసిన ధార్మిక పర్యటన: మంత్రాలయంరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ధార్మిక పర్యటన ముగించుకుని గురువారం ఉదయం మంత్రాలయంకు చేరుకున్నారు. గతనెల 19వ తేదీన తన శిష్యబృందంతో కలసి బెంగళూరు, కుంభకోణం, చెన్నై, శ్రీరం గం, కన్యకుమారి, తాంజాహూరు, ఉడిపి, పూణే వంటి పట్టణాలకు బయలుదేరి వెళ్లారు. దాదాపు 15రోజుల పాటు పూజలుచేసి, పూర్వపు పీఠాధిపతుల ఉత్సవాలను నిర్వహించి అక్కడి భక్తులను ఆశీర్వ దిం చారు. ధార్మిక పర్యటన ముగించుకొని మంత్రాలయానికి చేరుకున్నారు.