స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:21 AM
మం త్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహరించారు.
మంత్రాలయం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): మం త్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహరించారు. ఆది వారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల, విద్యుత్ దీపాల మధ్య స్వర్ణ రథంపై ప్రహ్లాద రాయలను ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తికి ఊంజల సేవ నిర్వహించారు. మఠం పండితులు భక్తులకు ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం అధికారులు మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, శ్రీపతి ఆచార్, సురేష్ కోణాపూర్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.